హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికుడికి జిల్లా స్థాయి అవార్డు

TPT: సూళ్లూరుపేట పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన సూళ్లూరుపేట పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుడు చిగురుపాటి చెంగయ్యకు జిల్లా స్థాయి ఉత్తమ స్వచ్ఛత వారియర్ అవార్డు లభించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛత అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా చెంగయ్య ఈ అవార్డును అందుకున్నారు.