హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొన్నారి వద్ద రోడ్డు యాక్సిడెంట్.. ఒకరి మృతి

ADB: తాంసి మండలం పొన్నారి గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఖోడద్ గ్రామానికి చెందిన జానీ రవీందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి బావ అంత్యక్రియలకు బైక్‌పై జైనథ్‌కు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.