హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తా'

KRNL: కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు జిల్లా ఇన్‌చార్జిగా జెంగిటి లక్ష్మినరసింహ యాదవ్‌ ఇవాళ నియమితులయ్యారు. గాంధీ జయంతి రోజున బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.