హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

MDK: నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రదీప్ (30) అనారోగ్యం తాళలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల 29న అనారోగ్యంగా ఉందని ఇంటి నుండి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ లొకేషన్ ఆధారంగా రాయారావు చెరువు వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం చెరువులో మృతదేహం తేలడంతో పోలీసులు ప్రదీప్‌గా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.