ASF: వాంకిడి(M) లోని సోయంగూడ, రింగారీట్ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిరే ప్రకాష్ తెలిపారు. వర్షాకాలంలో రహదారులు బురదమయంగా మారి గర్భిణులు, రోగులు రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయా గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రోడ్డు సౌకర్యం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు'


