హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల కాలువలకు నీటి సరఫరా నిలిపివేత.!

WNP: జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటి విడుదలను ఉదయం నుంచి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సాగునీటిని పొదుపుగా వాడుకునేలా వారబంది విధానం అమలు చేస్తున్నామని, ప్రస్తుతానికి తాగునీటికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. నీటి విడుదల పునరుద్ధరణ సమాచారాన్ని రైతులకు త్వరలోనే తెలియజేస్తామని పేర్కొన్నారు.