హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌బీడబ్ల్యూ నిందితుడి అరెస్ట్

అనకాపల్లిలో సుదీర్ఘకాలంగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు ఓం ప్రకాశ్ యాదవ్‌ను శుక్రవారం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011 నాటి కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో స్థానిక కోర్టు ఇతనిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో సీఐ ప్రేమ కుమార్ పర్యవేక్షణలో సిబ్బంది నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు.