ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. చైనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించింది. IND తరఫున లాల్‌రెమ్‌సియామి గోల్ చేసింది. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు 44 ఏళ్ల పసిడి కరవు తీర్చింది. ఈ విభాగంలో టీమిండియా చివరిగా.. స్వదేశంలో 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గింది. IND ఖాతాలో మొత్తంగా 76 పతకాలు ఉన్నాయి.
క్రీడలు
44 ఏళ్ల కల.. మహిళల హాకీలో స్వర్ణం


