NLG : నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొనాయిగూడెంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటి సంపులో పడి 11 నెలల బాలుడు స్టాలిన్ మృతి చెందినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. బాలుడి తల్లి మమత ఇంట్లో నిద్రిస్తుండగా, చిన్నారి ఆడుకుంటూ బయటకు వచ్చి ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు చూసేసరికి బాలుడు మృతి చెందాడు.
తెలంగాణ
నీటి సంపులో పడి పసికందు మృతి


