హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి

BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుప్పటి భద్రయ్య తండ్రి కొమురయ్య ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, కష్టకాలంలో అండగా ఉంటామని చెప్పారు.