హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎంపీ

HYD: కొంపల్లిలో గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. అనంతరం కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.