హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ MLA

HNK: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి పథకం ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హనుమకొండ జిల్లా వడ్డేపల్లి జంక్షన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మాజీ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొని కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.