హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బూర్జ ఆయుర్వేద వైద్యశాలకు అవార్డు

PPM: సీతానగరం మండలంలోని బూర్జ ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించింది. స్వచ్ఛత, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డా. టి. హేమాక్షి కి అవార్డుకు ఎంపిక చేశారు. శుక్రవారం పార్వతీపురంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర సదస్సులో కలెక్టర్ అవార్డును అందించారు.