హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 3న SMC ఎన్నికలు

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో వివిధ కారణాల వల్ల పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలను వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలను ఈ నెల 3న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) కే.వీ. లోకరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.