తూ.గో: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణతో పాటు పరిష్కార ప్రక్రియ అక్టోబర్ 10 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 16న ప్రచురిస్తామని చెప్పారు. సవరించిన తేదీలను రాజకీయ పార్టీలకు తెలియజేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా షెడ్యూల్లో కీలక మార్పు: కలెక్టర్


