హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలి'

MLG: దళితుల అసైన్డ్ భూములకు పూర్తి హక్కులతో పట్టాలు జారీ చేయాలని కేవీపీఎస్ జిల్లాకార్యదర్శి రత్నం ప్రవీణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ములుగులో కేవీపీఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి మాట్లాడారు. దళితులకు చేవెళ్ల డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని, నిరుద్యోగులకు రుణాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.