ATP: అనంతపురం సెంట్రల్ జైలులో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఖైదీల దినోత్సవంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తన అలవరచుకుని, జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. జైలులోని వృత్తి విద్యా శిక్షణ, లైబ్రరీ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విడుదలయ్యాక స్వయం ఉపాధి కల్పించేందుకు సహకరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్ప్రవర్తనతో సమాజంలో కలవాలి: కలెక్టర్ ఆనంద్


