హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం:MLA పాయల్

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్, పందిరిలోద్ది గ్రామాల్లో MLA పాయల్ శంకర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా చించుఘాట్ గ్రామంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.55 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ షెడ్ నిర్మాణ పనులకు MLA భూమిపూజ చేశారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మౌలిక వసతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.