హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమిత్ షా పర్యటనకు పకడ్బందీ భద్రత: ఎస్పీ

MDK: అక్టోబర్ 4న తూప్రాన్ మండలం బ్రహ్మణపల్లికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులతో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, రూట్ మ్యాప్‌లపై సమీక్షించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.