WGL: వరంగల్ పోతురాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద బాబురావు అనారోగ్యంతో మృతి చెందగా, మాజీ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి. అధైర్యపడవద్దని, కుటుంబానికి కొండా దంపతుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు.తక్షణ సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు.
తెలంగాణ
బాబురావు కుటుంబాన్ని పరామర్శించిన కొండా సురేఖ


