హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగో ప్లాట్‌ఫారం నిర్మించాలని వినతి..

MHBD:మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నాలుగో ప్లాట్‌ఫారం నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్‌ రామరాజు కోరారు. స్టేషన్‌ పనుల పరిశీలనకు వచ్చిన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవకు వినతిపత్రం అందజేశారు.నాలుగో ప్లాట్‌ఫారం లేక వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులు మెట్లు ఎక్కి దిగుతూ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.