హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కన్నపేటలో వృథాగా హ్యాండ్ బోర్

MDK: రామాయంపేట మండలంలోని అక్కన్నపేట రైల్వే గేట్ వద్ద ఉన్న హ్యాండ్‌బోర్ సరైన నిర్వహణ లేక అధ్వానంగా మారింది. చుట్టూ పిచ్చిమొక్కలు, చెత్త పేరుకుపోయాయి. వృథాగా ఉన్న హ్యాండ్‌బోర్‌ను తొలగించి, బోరుబావిలో మోటార్ ఏర్పాటు చేసి గ్రామానికి నీటి సరఫరా చేయాలని గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారులను కోరుతున్నారు.