SDPT: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ములుగు మండలం క్షీరసాగర్ గ్రామానికి చెందిన దారా సురేష్ రక్తదానం చేశారు. దారా యెల్లయ్య కుమారుడైన సురేష్ 20వసారి రక్తదానం చేయడం విశేషం. హైదరాబాద్ కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ కోసం చికిత్స పొందుతున్న 72 ఏళ్ల చెరుకూరి కోటేశ్వరరావుకు రక్తాన్ని అందించారు. అయన్ని పలువురు అభినందించారు.
తెలంగాణ
ఆపదలో ముందుండడమే లక్ష్యం.. 20వసారి రక్తదానం


