హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ

BDK: జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది సైతం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింసా మార్గాలు దేశ ప్రజలకు ఆదర్శం అని పేర్కొన్నారు.