హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: ఎల్‌.ఎన్‌.పేట మండలంలోని మోదుగ వలస కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, రిటైనింగ్ వాల్‌ నిర్మాణ పనులకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు.