హైదరాబాద్: 28°C
క్రీడలు

రెడ్‌ బాల్‌ క్రికెట్‌కు IND స్టార్ ప్లేయర్ గుడ్‌బై

భారత క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. చాహల్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. దేశీయ, కౌంటీ సర్క్యూట్‌లలో 17 ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశం అతడికి ఇప్పటి వరకు లభించలేదు. ఆగస్టు 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.