హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: PHCని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

VKB: వికారాబాద్ రామయ్యగూడ PHCని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఇవాళ సందర్శించారు. గర్భిణీలకు అవసరమైన ఐరన్, కాల్షియం మాత్రలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. PHCల్లో మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే విదేశాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. అన్ని PHCల్లో వెంటనే మందులు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.