హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్‌కు ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల వినతి

ASR: ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రతినిధులు శుక్రవారం పాడేరులో కలెక్టర్ నిషాంతిని కలిసి జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన  డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. మీడియా కమిషన్, ప్రత్యేక రక్షణ చట్టం, ప్రమాద బీమా, ఆరోగ్య పథకం, వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరించాలన్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్, రైల్వే రాయితీ వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.