హైదరాబాద్: 28°C
తెలంగాణ

పౌష్టికాహారం అందించడమే 'తొలి ముద్ద' లక్ష్యం

VKB: చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే 'తొలి ముద్ద' లక్ష్యమని ZP సీఈవో సుధీర్ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడ అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించారు. సమతుల్య పోషకాహారం చిన్నారుల శారీరక, మానసిక, భావోద్వేగ వికాసానికి ఎంతో అవసరమని సుధీర్ తెలిపారు.