హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

GDWL: మల్దకల్ మండలం మద్దలబండలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ చిన్న ఈరన్న శుక్రవారం ఉదయం పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ జంపర్ సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కుటుంబానికి ఆధారమైన యువకుడు మృతి చెందడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.