ASF:పెంచికల్‌పేట రేంజ్ పరిధిలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లూర్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎల్లూర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ఎల్లూర్ నుంచి ఎల్కపల్లి వరకు ర్యాలీ చేపట్టి వన్యప్రాణులు, అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించడం మనందరి బాధ్యతని అటవీ అధికారులు తెలిపారు.
తెలంగాణ
ఎల్లూర్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం


