హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ జయంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

NLG: గాంధీ జయంతి సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించి అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.