KMM: తల్లాడ మండలం లక్ష్మీపురంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను శుక్రవారం కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పరిశీలించారు. పనుల పురోగతిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం రైతులతో సమావేశమై వారి సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. భూముల వివరాలను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
భూముల రీ-సర్వే ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్


