హైదరాబాద్: 28°C
తెలంగాణ

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు

WNP: అమరచింత మండలం నాగల్ కడుమూరు గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని 'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు' నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, యువకులు సురేందర్రెడ్డి, జె.వెంకటేష్, కె.భీరప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.