హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాల్ గోడ కూల్చివేతపై ఫిర్యాదు

GDWL: జిల్లా కేంద్రంలోని 2వ రైల్వే గేట్ వద్ద తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం కమిటీ హాల్ స్థలంలో అనుమతులు లేకుండా చొరబడి కాంపౌండ్ గోడను కూల్చివేశారని సంఘం నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వెంకట్రారాములు, ఆయన అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కళ్యాణ్ కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు.