SRPT: గాంధీ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చింతా బాబు మాదిగ మాట్లాడుతూ.. గాంధీజీ, అంబేడ్కర్ సహా మహనీయులందరూ దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
గాంధీ జయంతి వేళ పేదలకు వస్త్రదానం


