SRD: ఖేడ్ పట్టణంలో జరిగిన 'తపస్' జిల్లా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్ మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ నివేదికను స్వీకరించి 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు రమేష్, దత్తాత్రి, సుధాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ
పీఆర్‌సీ, ఓపీఎస్‌పై తపస్ డిమాండ్


