హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు

GNTR: తెనాలి మండలం బుర్రిపాలెంలో అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. పీఎంఏవై గ్రామీణ్ కింద మంజూరైన గృహాలకు శంకుస్థాపన, బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు ఐదు వేల మంది హాజరయ్యే అవకాశం ఉండటంతో తాగునీరు, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు.