SDPT: చేర్యాల పట్టణంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన గాంధీ సెంటర్ ప్రస్తుతం విగ్రహం లేక వెలవెలబోతోంది. జాతీయ రహదారి 365/B విస్తరణలో భాగంగా రెండేళ్ల క్రితం గాంధీ విగ్రహాన్ని తొలగించి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉంచారు. రహదారి పనులు పూర్తయినా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయలేదు. గాంధీ సెంటర్‌లోనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గాంధీ సెంటర్‌కు పూర్వ వైభవం ఎప్పుడు?


