GDWL: గద్వాల కలెక్టరేట్‌లో కారుణ్య నియామకం కింద నలుగురు అభ్యర్థులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టింగ్ ఉత్తర్వులు అందజేశారు. ముగ్గురికి ఇంటర్మీడియట్, ఒకరికి విద్యాశాఖలో నియామకం ఇచ్చారు. అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో RDO శ్రీనివాసరావు, AD మంజుల పాల్గొన్నారు.
తెలంగాణ
కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా!


