హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీజీ, శాస్త్రిల జీవితాలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

GNTR: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పిలుపునిచ్చారు. తెనాలి ఆర్డీవో కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ నుంచి ఓర్పు, అహింస, సత్యం, శాస్త్రిజీ నుంచి నిరాడంబరత, నిజాయితీ నేర్చుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఆర్డీవో శ్రీరమణి పాల్గొన్నారు