MDK: విజయదశమి పండుగ రోజు డబ్బుల కోసం పాలపిట్టలను పంజరంలో బంధించి తిప్పితే కఠిన చర్యలు తీసుకుంటామని రామాయంపేట FRO విద్యాసాగర్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. పాలపిట్టను వేటాడటం, బంధించడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా బంధిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. పిట్టలను స్వేచ్ఛగా ఎగరనివ్వాలన్నారు.
తెలంగాణ
పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు: FRO


