హైదరాబాద్: 28°C
తెలంగాణ

భాగ్యతండాలో కళ్యాణలక్ష్మి వేడుకలు

WGL: కళ్యాణలక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భాగ్యతండాలో వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి కుటుంబాలకు అండగా నిలిచిన పథకంగా కళ్యాణలక్ష్మి నిలిచిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.