ADB: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం అండర్-14, 17 ఏళ్ల విభాగం బాలబాలికల జోనల్ స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మంచిర్యాల, నిర్మల్, కుమురం భీమ్, ఆదిలాబాద్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్, బట్టర్ ఫ్లై విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
తెలంగాణ
ఉత్సాహంగా జోనల్ స్థాయి స్విమ్మింగ్ పోటీలు


