హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధర్పల్లిలో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతిని గురువారం బదిలీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్ కమిషనరేట్ పిసిఆర్ లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సల్వాడి రామన్నను నియమించారు. ఈ మేరకు మల్టీ జోన్ 1 ఐ జి పి సంపత్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అనంతరం సల్వాడి రామనను ధర్పల్లి సిఐగా బాధ్యతలు చేపట్టనున్నారు.