PDPL: పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని మేడారం సర్పంచ్ వీర్ పాల్ పేర్కొన్నారు. శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికుల పాత్ర కీలకమైనదని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి మౌనిక, ఉపసర్పంచ్ రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవి'


