HNK: అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయకనగర్‌లో అంగిడి సమ్మక్క (65) వద్ద రూ.1,12,430 విలువైన మద్యం, బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట జూబ్లీ మార్కెట్ సమీపంలోని వడ్డెరబస్తీలో గుంజ శిరీష (30) వద్ద రూ.13,810 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు.
తెలంగాణ
అక్రమ మద్యం విక్రయం.. ఇద్దరు మహిళలు అరెస్ట్


