MBNR: జడ్చర్ల, మిడ్జిల్ మండలాల నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి గుడిసెల పట్టాలు పంపిణీ చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇంటి స్థలాల పట్టాలు అందించి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ


