హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు

MHBD: మహబూబాబాద్ నియోజకవర్గంలోని 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు ఎమ్మెల్యే డా. మురళి నాయక్ ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.