హైదరాబాద్: 28°C
తెలంగాణ

బావిలో యువకుడి మృతదేహం

MBNR: ధన్వాడ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన బావిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై మహేశ్వరి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి, పంచనామా అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.